Tue Jan 20 2026 23:50:33 GMT+0000 (Coordinated Universal Time)
Heart Attack : గుండెపోటుకు మరో నటుడు బలి
ప్రముఖ తమిళనటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మరణించారు

గుండెపోటు మరణాలు చిత్ర పరిశ్రమను విషాదంలో నింపుతున్నాయి. యువకులు గుండెపోటుతో మరణిస్తుండటంతో చిత్ర పరిశ్రమకు వరస షాక్ లు తగలుతున్నాయి. తాజాగా ప్రముఖ తమిళనటుడు డేనియల్ బాలాజీ మరణించారు. తమిళంలో ఆయన అనేక సినిమాల్లో నటించారు. గుండెపోటుకు గురైన బాలాజీ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున మరణించారు.
తెలుగు సినిమాల్లోనూ....
డేనియల్ బాలాజీ విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో నటించారు. ఆయన తమిళ సినిమాల్లో అనేక కీలక పాత్రలను పోషించారు. తెలుగులో కూడా ఆయన సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ వంటి సినిమాల్లో విలన్ గా ప్రేక్షకులకు కనిపించారు. విలన్ పాత్రలనే ఎక్కువ చేసిన బాలాజీ మరణంతో తెలుగు, తమిళ సినీ రంగాలకు తీరని లోటు అని చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Next Story

