Mon Feb 02 2026 00:04:51 GMT+0000 (Coordinated Universal Time)
మణిరత్నంకు కోవిడ్ పాజిటివ్
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు

ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. స్వల్ప అస్వస్థత ఉండటంతో మణిరత్నం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అపోలో ఆసుపత్రిలో మణిరత్నంకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థిితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
అపోలో ఆసుపత్రిలో....
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై సినిమా రంగానికి చెందిన వారు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఆయన కరోనా బారిన పడినట్లు తేలింది. ఈరోజు మణిరత్నం సతీమణి సుహాసిని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేయనున్నారని కోలివుడ్ వర్గాలు వెల్లడించాయి.
Next Story

