Mon Feb 02 2026 02:04:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పూనమ్ పాండే మృతి.. ఇందులో నిజమెంత?
ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారు. చిన్న వయసులోనే ఆమె మరణించారు.

ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారు. చిన్న వయసులోనే ఆమె మరణించారు. క్యాన్సర్తో గత కొంతకాలంగా బాధపడుతూ పూనమ్ పాండే మరణించినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో పూన్ మృతి చెందినట్లు పూనమ్ పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అతి చిన్న వయసులో ఆమె మృతి చెందడమేంటని నెటిజన్లు, ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారికంగా...
అయితే ఈ వార్తలో నిజం ఎంత అన్నది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 4న కాన్సర్ డే కావడం తో ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని మీడియా వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన పూనమ్ పాండే తర్వాత బాలివుడ్ లోకి ప్రవేశించారు. వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత్ గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలోకి వస్తానని వ్యాఖ్యానించడంతో ఆమె అందరి దృష్టిలో పడ్డారు.
Next Story

