ఈ ఇద్దరిలో ఎవరు టాప్ లేపుతారో?
ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రేంజ్ హీరోయిన్స్ లో ఇద్దరే ఇద్దరి పేర్లు వినబడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల చాయిస్ ఆ ఇద్దరి హీరోయిన్స్ కావడంతో.. అందరి చూపు [more]
ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రేంజ్ హీరోయిన్స్ లో ఇద్దరే ఇద్దరి పేర్లు వినబడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల చాయిస్ ఆ ఇద్దరి హీరోయిన్స్ కావడంతో.. అందరి చూపు [more]

ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రేంజ్ హీరోయిన్స్ లో ఇద్దరే ఇద్దరి పేర్లు వినబడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల చాయిస్ ఆ ఇద్దరి హీరోయిన్స్ కావడంతో.. అందరి చూపు ఆ హీరోయిన్స్ మీదే ఉంది. రెండు హిట్స్ తో మహేష్, అల్లు అర్జున్ సరసన ఛాన్సులు పట్టేసిన రష్మిక మందన్న, హిట్స్ లేకపోయినా.. స్టార్ హీరోలతో దున్నేస్తున్న పూజ హెగ్డేలు. ఈ ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ పడుతున్న హీరోయిన్స్. అటు రెమ్యునరేషన్ విషయంలోనూ, ఇటు సినిమాల విషయంలోనూ రష్మిక, పూజ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో.. ప్రస్తుతం టాప్ లో ఉన్న ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొట్టి టాప్ లేపుతారో అంటూ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాలో బన్నీ కి బాస్ గా పూజ కాస్త కోపిష్టి బాస్ గా నటిస్తుందని టాక్. ఇక అల్లు అర్జున్ తో పూజ కాంబో పిక్స్ కూడా చూడడానికి చాలా రొమాంటిక్ గా ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పాటల్లోనూ పూజ డాన్స్ లు ఉంటాయని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇక పూజ హెగ్డే – అల్లు అర్జున్ ఇద్దరు డీజే లో డాన్స్ షో చేసి ఆకట్టుకున్నారు. మరి ఈ సినిమాలో పూజ లుక్స్ దాదాపుగా రివీల్ అయ్యాయి. ఇక మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్న రష్మిక లుక్ చాలా సింపుల్ గా ఉంది. ఇక మహేష్ సరసన రష్మిక ఎలా ఉంటుందో కనీసం లుక్ లో చూడలేదు. ఇంకా మహేష్ – రష్మిక కాంబో లుక్ బయటికి రాలేదు. ఇక మహేష్ కి పెద్దగా డాన్స్ లు రావు. రష్మిక కూడా గొప్ప డాన్సర్ కాదు. మరి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు రెండు రెండే అన్న రేంజ్లో క్రేజ్ కొట్టేశాయి. మరి ఈ సంక్రాంతికి మహేష్ – అల్లు అర్జున్ ల మీద ఎంత క్రేజ్, ఎంత అంచనాలున్నాయో ఈ ఇద్దరు హీరోయిన్స్ పూజ – రష్మిక ల మీద ఉన్నాయి.

