Wed Mar 11 2026 21:21:27 GMT+0530 (India Standard Time)
సూర్యను కొడితే లక్ష అట
స్టార్ హీరో సూర్యపై తమిళనాడులో రాజకీయపార్టీ బెదిరింపులకు దిగింది. జై భీమ్ సినిమాతో సూర్య కొత్త ట్రెండ్ సృష్టించారు.

స్టార్ హీరో సూర్యపై తమిళనాడులో రాజకీయపార్టీ బెదిరింపులకు దిగింది. జై భీమ్ సినిమాతో సూర్య కొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ సినిమాలో మతపరమైన విషయాలు కొన్ని వర్గాల్లో అభ్యంతరం తలెత్తింది. దీనిపై తమిళనాడులోని పీఎంకే కుల అల్లర్లను రెచ్చగొట్టే విధంగా రూపొందించిన ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని పోలీసులకు పీఎంకే ఫిర్యాదు చేసింది.
సంచలన ప్రకటన....
ఈ సందర్భంగా పీఎంకే నేత పన్నీర్ సెల్వం సంచలన ప్రకటన చేశారు. సూర్యపై దాడి చేస్తే పీఎంకే తరుపున లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మైలాడుతూరు జిల్లాలో పీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ సూర్య నటించిన జై భీమ్ సినిమాను నిలిపివేశారు. ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి పై దాడి జరిగిన నేపథ్యంలో పీఎంకే నేతలు ఈ ప్రకటన చేశారు.
Next Story

