Fri Dec 05 2025 16:24:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇబ్బందుల్లో సాయి పల్లవి.. హైదరాబాద్ లో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు
అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?

నటి సాయి పల్లవి అనుకోని ఇబ్బందుల్లో పడింది. కశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలో చూపించారు. ఈ విషయాన్ని మీరు మతపరమైన సంఘర్షణగా చూస్తున్నట్టయితే... అలాంటివే మరికొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. వాహనంలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం వ్యక్తులపై దాడి చేశారు. అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?' అని ఆమె ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఒక ముస్లింను కొట్టడానికి, ఒక జాతినే అంతం చేయాలని చేసిన ప్రయత్నానికి చాలా తేడా ఉందని సాయి పల్లవికి హితవు పలికారు.
తాజాగా ఆమెపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ సలహా తీసుకున్న మీదట సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భజరంగ్ దళ్ నేతలకు చెప్పారు.
News Summary - bhajarang dal activists complaint on sai pallavi
Next Story

