Sat Dec 06 2025 03:04:37 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవిని అభినందించిన ప్రధాని మోదీ
చిరంజీవి విలక్షణమైన నటుడు అని కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల..

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి ఈ అరుదైన పురస్కారం దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చిరంజీవి విలక్షణమైన నటుడు అని కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారని ట్వీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంటున్నందుకు చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు. మోదీ అభినందనలపై చిరంజీవి బదులిచ్చారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. మీ అభినందనలను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశంసాపూర్వకమైన మీ మాటలు సంతోషదాయకం అని పేర్కొన్నారు.
Next Story

