Fri Dec 05 2025 22:47:55 GMT+0000 (Coordinated Universal Time)
తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయం మోకిల లోని..

నందమూరి తారకరత్న (39) గుండెపోటుతో.. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న (ఫిబ్రవరి 18) సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి నందమూరి కుటుంబంలో, ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయం మోకిల లోని ఆయన స్వగృహంలో ఉంది. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్ కు భౌతిక కాయాన్ని తరలిస్తారు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
తారకరత్న ఆకస్మిక మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. "శ్రీ నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు మరియు వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, అభిమానులతో ఉన్నాయి. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతిః" అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Next Story

