రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ..?
రాకేష్ మాస్టర్ చాలా రోజుల నుండి అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ అనాథశరణాలయంలో ఉంటున్నారు. రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక ప్రోగ్రాం షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం కు వెళ్లిన రాకేష్ మాస్టర్ తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గాంధీ హాస్పిటల్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డయాబెటిక్ పేషంట్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. రక్త విరోచనాలు అవుతున్నాయని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రాకేష్ మాస్టర్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డయాబిటిక్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో రాకేశ్ మాస్టర్ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఆయన్ను బతికించాలని డాక్టర్ల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ మృతిచెందారని గాంధీ ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మీడియాకు వెల్లడించారు.

