Sat Apr 19 2025 09:03:59 GMT+0000 (Coordinated Universal Time)
Junior Ntr : పూలచొక్కా అదుర్స్ "దేవరా".. ఖరీదెంతో తెలిస్తే?
జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ లో తిరుగతూ ధరించిన షర్ట్ ఫొటో కూడా వైరల్ గా మారింది.

పాత జనరేషన్ కాదు.. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు మంచి లైఫ్ ను అనుభవిస్తున్నారు. తీరిక దొరికితే చాలు ఎంజాయ్ చేస్తుంటారు. డబ్బులు కూడా అలాగే వచ్చి పడుతున్నాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్ హయాంలో రెమ్యునరేషన్ సినిమాకు లక్షల్లో ఉంటే ఇప్పుడు ఎన్నికోట్లనేది సినిమా విడుదలయి విజయం సాధించిన తర్వాత కానీ తెలియదు. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు.. మూవీలో వారికి పార్ట్ నర్ షిప్ కూడా ఉంటుంది. లాభాల్లో వాటాతో కొన్ని వందల కోట్లను అలవోకగా సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రెండు సినిమాలు చేసినా చాలు యంగ్ హీరోలు వంద కోట్లకు పైగానే సంపాదించుకుంటారు. అలా వచ్చి పడుతున్న ఆదాయంతో ఖరీదైన జీవితాన్ని ఈతరం హీరోలు అవలంబిస్తున్నారు.
ఖరీదైన జీవితం...
ఉండే ఇల్లు.. తిరిగే కారు.. వేసుకునే చెప్పులు.. పెట్టుకునే వాచీ... కాళ్లకు ఉండే షూస్.. ఇలా అన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందినవే. పేరున్న బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. యంగ్ హీరోలందరూ దాదాపు అంతే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్ట్ లీ వస్తువులను మాత్రమే వాడతాడు. ఒక్కొక్క మూవీకి యాభై నుంచి వంద కోట్ల రూపాయలు వస్తుండటంతో ఆయన తన లగ్జరీ లైఫ్ ను ఏమాత్రం దాచుకోరు. బయటకు వస్తున్నాం కదా? అని సాదాసీదాగా కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఖరీదైన కార్లు అంటే.. కోట్లాది రూపాయల విలువైన కార్లు నాలుగైదు అలా షెడ్ లో కనిపిస్తుంటాయట. రెండు కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లు కూడా జూనియర్ కలెక్షన్స్ లో ఉన్నాయంటారు.
దుబాయ్ లో ధరించిన చొక్కా...
ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ లో తిరుగతూ ధరించిన షర్ట్ ఫొటో కూడా వైరల్ గా మారింది. దుబాయ్ కి వెకేషన్ కోసం వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చారు.అయితే ఆఫొటోలు సంగతి ఎలా ఉన్నా అందులో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన చొక్కా పైనే ఇప్పుడు సోషల్ మీడియలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. పూలపూల చొక్కా ధర కోసం నెట్టింట ఆయన ఫ్యాన్స్ వెతుకుతున్నారు. ఎట్రో అనే బ్రాండ్ చొక్కా ఆన్ లైన్ 85 వేల రూపాయల వరకూ ఉందట. దీంతో చొక్కా అదుర్స్ అంటూ నెట్టింట్ కామెంట్స్ పెడుతున్నారు. తమ అభిమాన హీరో ధరించిన చొక్కా ధరపై ఇప్పుడు నెట్టింట డిస్కషన్ ఓ రేంజ్ లో జరుగుతుంది.
Next Story