రెండింటితో తన మీదున్న నిందని చెరిపేస్తుందా?
పాయల్ రాజ్ ఫుట్ అంటేనే గ్లామరస్ భామ. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అన్నట్టుగా గాతయారైంది. RX 100, RDX లవ్ సినిమాల్తో పాయల్ మీద బోల్డ్ [more]
పాయల్ రాజ్ ఫుట్ అంటేనే గ్లామరస్ భామ. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అన్నట్టుగా గాతయారైంది. RX 100, RDX లవ్ సినిమాల్తో పాయల్ మీద బోల్డ్ [more]

పాయల్ రాజ్ ఫుట్ అంటేనే గ్లామరస్ భామ. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అన్నట్టుగా గాతయారైంది. RX 100, RDX లవ్ సినిమాల్తో పాయల్ మీద బోల్డ్ బేబీ అనే ముద్ర పడిపోయింది. అందుకే ఆమె వెంకిమామ, డిస్కో రాజా సినిమాలు చేస్తున్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా. పాయల్ దగ్గరికి మళ్ళీ బోల్డ్ కంటెంట్ కథల్తోనే దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారు అంటే.. పాయల్ పై ఆ బోల్డ్ ముద్ర ఎంతగా పడిందో ఆర్ధమవుతుంది. అయితే పాయల్ రాజ్ ఫుట్ వెంకిమామ సినిమాలో వెంకటేష్ సరసన ట్రెడిషనల్ గా క్యూట్ గా కనబడుతుంది. సాంగ్స్ మినహాయిస్తే.. వెంకిమామ లో పాయల్ చీరకట్టులోనే కనబడుతుందని టాక్.
మరోవైపు రవితేజ సరసన డిస్కో రాజాలోను పాయల్ రాజ్ ఫుట్ గ్లామరస్ గాను, కాస్త పద్దతి గల అమ్మాయిలా అంటే పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుందట. అయితే డిస్కో రాజా లో పాయల్ లుక్ బయటికి రాలేదు కానీ… ఆ సినిమాలో ఇద్దరు మూగ్గురు హీరోయిన్స్ లో పాయల్ ఒకరు. అయితే వెంకిమామ తో పాయల్ డిసెంబర్ 13 న ప్రేక్షకులు ముందుకు రాబోతుంటే…. డిస్కో రాజ తో డిసెంబర్ 25 న వస్తుంది అనుకున్నారు. కానీ డిస్కో రాజా జనవరి 25 కి షిఫ్ట్ అవడంతో.. ఆ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోలేదని, డిసెంబర్ అయితే ఇప్పటికే డిస్కో రాజా ప్రమోషన్స్ మొదలెట్టేవారని అంటున్నారు. మరి పాయల్ రాజపుట్ వెంకిమామ, డిస్కో రాజా సినిమాల్తో తన మీదున్న బోల్డ్ ముద్ర చెరిపేసుకుని…మంచి హీరోయిన్ పాత్రలు పట్టాలని రెడీ అవుతుంది.

