పవన్ అడ్డంగా ఇరుక్కున్నట్టే..!!
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండి సినిమాలను వదిలేసాడు. కానీ రాజకీయాల్లో ఖర్చు పెట్టడమే కానీ.. వెనక్కి తిరిగి వచ్చే సూచనలు లేకపోవడంతో.. పవన్ కళ్యాణ్ [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండి సినిమాలను వదిలేసాడు. కానీ రాజకీయాల్లో ఖర్చు పెట్టడమే కానీ.. వెనక్కి తిరిగి వచ్చే సూచనలు లేకపోవడంతో.. పవన్ కళ్యాణ్ [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండి సినిమాలను వదిలేసాడు. కానీ రాజకీయాల్లో ఖర్చు పెట్టడమే కానీ.. వెనక్కి తిరిగి వచ్చే సూచనలు లేకపోవడంతో.. పవన్ కళ్యాణ్ గతంలో కొంతమంది నిర్మాతలు దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇవ్వలేకే ఈ ఏడాది మల్లి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్, క్రిష్ సినిమా, హరీష్ తో మూవీలను ఆఫీసియల్ గా ప్రకటించిన పవన్ కి కరోనా తో ఈ మూడు సినిమాలు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మూవీస్ ని చెయ్యొద్దని ఫిక్స్ అవుదామనుకున్నాడు. కానీ పవన్ ఇచ్చిన అడ్వాన్స్ లను నిర్మాతలు వెనక్కైనా ఇవ్వాలి.. లేదంటే సినిమా అయినా చెయ్యాలంటూ ఒత్తిడి చేస్తున్నారట.
గతంలో పవన్ రామ్ తాళ్లూరి దగ్గర భారీగా అడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే రాజకీయాల్లో సక్సెస్ అయితే వాటిని వడ్డీ కట్టి రామ్ కి ఇచ్చేద్దామనుకున్నాడు. కానీ ఇంతవరకు రామ్ కి డబ్బు చెల్లించకపోయేసరికి.. ఇప్పుడు రామ్ తాళ్లూరి తో సినిమా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందట. రామ్ తాళ్లూరి డబ్బైనా కట్టాలి, లేదా సినిమా అయినా చెయ్యాలి అని అంటున్నాడట. డబ్బు కట్టడం పవన్ కి ఇప్పుడు సాధ్యం కాదు… అందుకే సినిమా చెయ్యాల్సి వస్తుంది. రామ్ తాళ్లూరి సినిమా ఎప్పుడనేది చెప్పలేం కానీ.. రామ్ తో పవన్ సినిమా పక్కా. ఇక ఈ సినిమాకి డాలి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది.
అయితే ఇప్పుడు రామ్ తాళ్లూరి పవన్ ని కలిసి సినిమాపై ప్రకటన అయినా ఇచ్చుకుంటాను.. సినిమా ఎప్పుడు చేసినా పర్లేదు అని ఆడుగుతున్నాడట. అడగడమే కాదు పవన్ పై ఒత్తిడి పెంచుతున్నాడట. మరి కరోనా తో టైం వెస్ట్ అయ్యింది కాబట్టే… మూడు సినిమాల్తో ముగించేసి మల్లి రాజకీయాలు చేసుకుంటూ ఉండమని పవన్ మిగతా సినిమాలను పక్కన బెడితే ఇప్పుడు ఇలా అడ్వాన్స్ ల విషయంలో నిర్మాతలకు అడ్డంగా బుక్ అవ్వాల్సిన పరిస్థితి.