ఏంటీ.. పవన్ పాన్ ఇండియాకెళ్ళడా?
టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా ట్రైన్ ఎక్కేస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా స్టార్స్ అవుతుంటే.. ప్రభాస్ బాహుబలితోనే పాన్ ఇండియా [more]
టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా ట్రైన్ ఎక్కేస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా స్టార్స్ అవుతుంటే.. ప్రభాస్ బాహుబలితోనే పాన్ ఇండియా [more]
టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా ట్రైన్ ఎక్కేస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా స్టార్స్ అవుతుంటే.. ప్రభాస్ బాహుబలితోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు. తాజాగా మహేష్ సర్కారు పాట కూడా బాలీవుడ్ ని చుట్టెయ్యబోతుంది అంటుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పాన్ ఇండియా మొహం చూడడం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందొ మొన్న ఆయన పుట్టిన రోజునాడే చూసాం. రెండేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందొ సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా చూసాం. బాలీవుడ్ నుండి కోలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ స్టార్స్ అంతా పవన్ ని విష్ చేసారు.
అయినా పవన్ మాత్రం పాన్ ఇండియా సాహసం చెయ్యడం లేదు. వకీల్ సాబ్, క్రిష్, హరీష్ సినిమాల్తో సినిమాలకు ప్యాకప్ చెబుతాడనుకున్న పవన్ కళ్యాణ్ మల్లి సురేందర్ రెడ్డి తో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు. మరి ఈ సినిమా కూడా తెలుగు రాష్ట్రాలకే పరిమితమా? లేదంటే పాన్ ఇండియానా అనేది తెలియదు? జస్ట్ అనౌన్సమెంట్ వచ్చింది. అయితే సై రా తో పాన్ ఇండియా క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయిన సురేందర్ రెడ్డి మళ్ళీ పవన్ తో పాన్ ఇండియా సాహసం చెయ్యలేదేమో .. అయినా అది పాన్ ఇండియా మూవీ అంటే ముందే అనౌన్స్ చేస్తారు. అంటే పవన్ – సురేందర్ రెడ్డిలు పాన్ ఇండియా కి వెళ్లడం లేదు ఇది ఫిక్స్. అయితే పవన్ పాన్ ఇండియా కెళ్ళడా? అందరూ పాన్ ఇండియా వైపు చూస్తుంటే పవన్ ఎందుకలా కామ్ గా ఉన్నాడంటే.. ఆయనకి రాజకీయాలతో పటు సినిమాలు చెయ్యాలి గనుకనే తెలుగు రాష్ట్రాలకు పరిమితమయ్యే మూవీస్ తోనే సరిపెడుతున్నాడు.. కానీ ఇండియా వైడ్ కి వెళ్లడం లేదు.
- Tags
- pawan kalyan