Fri Dec 05 2025 15:45:45 GMT+0000 (Coordinated Universal Time)
ఓజీకి సంబంధించిన క్రేజీ సమాచారం మీకోసమే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆయన పుట్టినరోజు నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆయన పుట్టినరోజు నాడు కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ'.. 'దే కాల్ హిమ్ ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్స్టర్' అనేది ఉపశీర్షిక. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. తాజాగా ఏ సమయానికి ఆ వీడియో విడుదల చేస్తామనేది కూడా చెప్పారు. సెప్టెంబర్ 2, శనివారం ఉదయం 10.35 గంటలకు 'ఓజీ' వీడియో గ్లింప్స్ రాబోతోంది. 'హంగ్రీ చీతా'కు సంబంధించిన వీడియో విడుదల చేస్తామని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలిపింది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. 'ఓజీ' సినిమాలో నటి శ్రియా రెడ్డి కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పలువురు బాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగమయ్యారు.
Next Story

