Fri Mar 06 2026 01:50:41 GMT+0530 (India Standard Time)
ఇరవై ఏళ్ల తర్వాత పవన్
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫొటోను పవన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏది చేసినా సంచలనమే. ఆయన ఏ లుక్ లో కన్పించినా అభిమానులు మురిసిపోతారు. ఆనందంతో తబ్బిబ్బవుతారు. పవన్ కల్యాణ్ సహజంగా సిగ్గు పడతారంటారు. అయినా ఇటీవల ఎక్కువగా ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మంచి ఫీస్ట్ ఇస్తారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు పవన్ ఫొటోలను చూసి తెగ సంబరపడి పోతున్నారు.
మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్...
ఆయన తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తీస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫొటోను పవన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత పవన్ ఆ లుక్ లో కనిపించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇరవై ఏళ్ల క్రితం జానీ సినిమా సందర్భంగా పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు తాజాగా చేస్తుండటం ఆయన ఫ్యాన్స్ కు పండగను తెచ్చి పెట్టింది.
Next Story

