Wed Mar 18 2026 23:23:12 GMT+0530 (India Standard Time)
Guntur : గుంటూరులో పవన్ అభిమానులు రచ్చ
గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమానులు సినిమా థియేటర్ పై దాడి చేశారు

గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమానులు సినిమా థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. బెనిఫిట్ షో ఉందంటూ టిక్కెట్లు విక్రయించి తర్వాత వేయకపోవడంతో పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఈశ్వరసాయి థియేటర్ వద్ద నిరసనకు దిగారు. థియేటర్ యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బెనిఫిట్ షో ఉందంటూ...
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈరోజు విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఫిరంగిపురంలోని ఈశ్వరసాయి థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో ఉందంటూ టిక్కెట్లను విక్రయించింది. ఒక్కో టిక్కెట్ ను మూడు వందల నుంచి ఐదు వందల వరకూ విక్రయించింది. అయితే ప్రభుత్వం బెనిఫిట్ షో వేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో షో రద్దయింది. దీంతో పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. మార్నింగ్ షోకు అనుమతిస్తామని చెప్పడంతో అభిమానులు శాంతించారు.
Next Story

