ఏకే రీమేక్ విషయంలో పవన్ ఫ్యాన్స్ గగ్గోలు
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కాంబోలో బడా మల్టీస్టారర్ గా గ్రాండ్ గా మొదలయ్యింది. [more]
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కాంబోలో బడా మల్టీస్టారర్ గా గ్రాండ్ గా మొదలయ్యింది. [more]
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కాంబోలో బడా మల్టీస్టారర్ గా గ్రాండ్ గా మొదలయ్యింది. ఆ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా కాస్త సందడి చేసాడు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం కాస్త గందర గోళం నెలకొంది ఏమిటంటే.. ఈ సినిమాకి త్రివిక్రమే కథ, మాటలు అన్ని అందిస్తున్నారని.. ఆ మధ్యన అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బకి ఇంకా ఆయిట్మెంట్ రాసుకుంటూ ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఇది ఇప్పుడు కొత్త టెన్షన్ లా తయారైంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో హిందీ క్లాసిక్.. లవ్ ఆజ్కల్ తీసుకొచ్చి త్రివిక్రమ్ చేతిలో పెడితే.. ఆ సినిమాకి త్రివిక్రమ్ తనదైన శైలిలో కథ, మాటలు రాసాడు.
అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ ని, స్క్రిప్ట్ ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు పవన్ అజ్ఞాతవాసి పెద్ద షాక్. అలాగే తీన్మార్ కి త్రివిక్రమ్ కథ అనగానే దానిని యధాతధంగా తెరకెక్కించక తప్పలేదు తీన్మార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జికి. ఆ తీన్మార్ రిజెల్ట్ ఎలా వచ్చిందో అనేది మనందరం చూసిందే. ఇప్పుడు కూడా అయ్యప్పమ్ కోషియమ్ మలయాళం హిట్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనగానే తీన్మార్ డేస్ గుర్తొస్తున్నాయి పవన్ ఫ్యాన్స్ కి. అందుకనే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చల లో ఈ తరహా చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడించొద్దు ప్లీజ్ తట్టుకోలేం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.