పవన్ హామీ ఇచ్చాడు అంతే
గత రెండు రోజులుగా తన దేవుడు పవన్ కళ్యాణ్ తనకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడంటూ బండ్ల గణేష్ పవన్ ని కలిసి వచ్చిన విషయాన్నీ ఫొటోతో [more]
గత రెండు రోజులుగా తన దేవుడు పవన్ కళ్యాణ్ తనకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడంటూ బండ్ల గణేష్ పవన్ ని కలిసి వచ్చిన విషయాన్నీ ఫొటోతో [more]
గత రెండు రోజులుగా తన దేవుడు పవన్ కళ్యాణ్ తనకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడంటూ బండ్ల గణేష్ పవన్ ని కలిసి వచ్చిన విషయాన్నీ ఫొటోతో సహా వైరల్ చేసాడు. దీనితో బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ తన ఐదో సినిమాని ప్రకటించేసాడనే అనుకున్నారు. మరి ఇప్పటికే వకీల్ సాబ్, క్రిష్ మూవీ, హరీష్ శంకర్ మూవీ అలాగే కొత్తగా సురేందర్ రెడ్డి సినిమాలకు కమిట్ అయ్యి ప్రకటన ఇప్పించిన పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాన్ని బండ్ల నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో చేస్తాడని అందరూ ఫిక్స్ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన వేరుగా ఉందట. అది పవన్ కళ్యాణ్ లైన్ లోఉన్న సినిమాల్లో వకీల్ సాబ్ అయ్యాక క్రిష్, హరీష్ సినిమాలు చేస్తాడట.
ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని కానీ సురేందర్ రెడ్డి మూవీ చేస్తాడని అయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని జస్ట్ హామీ ఇచ్చాడు కానీ.. అది ఇప్పుడే అందులోను సురేందర్ రెడ్డి సినిమా తర్వాత అని చెప్పలేదు. కానీ బండ్ల మాత్రం పవన్ తో తొందర్లోనే సినిమా మొదలు పెట్ట్టెస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజకీయాలు, వ్యాపారాలు కలిసిరాక మళ్ళి సినిమా నిర్మాతగా మునుపుటిలా ఓ వెలుగు వెలుగుదామని బండ్ల డిసైడ్ ఆయినా హీరోలెవరూ కరిణించడం లేదు. దానానితో పవన్ ని దేవుడు దేవుడుగా అంటూ వెనకాల పడి సినిమా ఓకె చేయించుకున్నాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో పవన్ చెప్తే కానీ క్లారిటీ రాదు. అంటే దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా ఉంది బండ్ల పరిస్థితి.