పవన్ కరుణించాలిగా?
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని చాలామంది దర్శకనిర్మాతలు కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కరుణ పడుతుందో లేదో తెలియదు. కారణం కరోనా పవన్ కళ్యాణ్ [more]
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని చాలామంది దర్శకనిర్మాతలు కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కరుణ పడుతుందో లేదో తెలియదు. కారణం కరోనా పవన్ కళ్యాణ్ [more]
![Pawan Kalyan Pawan Kalyan](https://www.telugupost.com/h-upload/old_images/1196311-pawankalyan.webp)
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని చాలామంది దర్శకనిర్మాతలు కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కరుణ పడుతుందో లేదో తెలియదు. కారణం కరోనా పవన్ కళ్యాణ్ అనుకున్న ఆశలమీద నీళ్లు చల్లింది. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు పవన్ కళ్యాణ్ సెట్స్ మీదికెళ్లనని చెప్పేసాడు. దానితో వకీల్ సాబ్ మరో 20 రోజుల షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. వకీల్ సాబ్ అవ్వాలి, క్రిష్ మూవీ కంప్లీట్ కావాలి, అలాగే హరీష్ మూవీ అవ్వాలి. తర్వాత ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారని అంటున్నారు కానీ.. పవన్ ఎవరిని కరుణిస్తాడో తెలియదు.
తాజాగా ఓ మలయాళ రీమేక్ లో పవన్ కళ్యాణ్ ని నటింప చెయ్యాలని సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూస్తున్నారట. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ హక్కులు కొని.. ముందు ఆ సినిమా కోసం బాలకృష్ణ తర్వాత రవితేజ – రానా లని సంప్రదించగా వారిలో బాలయ్య అసలు ఆసక్తి చూపలేదు. కానీ రవితేజ – రానా ఓకె చేసారనే టాక్ నడిచింది. కానీ తాజాగా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఉన్న మూడు సినిమాలే ఎప్పుడు పూర్తి చెయ్యాలో తెలియని పవన్ ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చెయ్యడానికి ఒప్పుకుంటాడా లేదో.. ఏదైనా పవన్ కరుణతోనే దర్శకనిర్మాతలకు పండగ.
- Tags
- pawan kalyan