Fri Dec 19 2025 02:27:55 GMT+0000 (Coordinated Universal Time)
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం నేడే.. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం నేడే రాజస్ధాన్ ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్ లో ఘనంగా జరగబోతుంది.

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన ఈ జంట.. మే నెలలో నిశ్చితార్థం చేసుకొని ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏడడుగులు వేసి ఒకటి అవ్వబోతున్నారు. నేడు సెప్టెంబర్ 24న వీరి వివాహం రాజస్ధాన్ లో ఘనంగా జరగబోతుంది. ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కాబోతుంది.
ఆల్రెడీ లీలా ప్యాలెస్ లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. హల్దీ, సంగీత్ వేడుకలతో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ పెళ్లిని కుటుంబసభ్యులతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్న రాత్రి పంజాబీ సింగర్ నవరాజ్ హన్స్ తో సంగీత్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నారు. ఇక ఈ పెళ్లి కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఈ వివాహానికి సుమారు 90 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు బి-టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీని పై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.parineeti chopra raghav chadha
Next Story

