Tue Dec 23 2025 13:11:31 GMT+0000 (Coordinated Universal Time)
పేపర్ బాయ్ వచ్చేస్తున్నాడు..!

సంతోష్ శోభన్ హీరోగా ప్రియశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్ఎన్ సినిమా బ్యానర్స్ పై సంపత్ నంది, రాములు, వెంకట్, నర్సింహులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లేని అందించడం విశేషం. ఇక ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. 'పేపర్ బాయ్' టైటిల్ సాంగ్ ని రచయిత కసర్ల శ్యాం రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో కథా రచయిత, నిర్మాత సంపత్ నంది, దర్శకుడు జయశంకర్, హీరో సంతోష్ శోభన్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో, నిర్మాతల్లో ఒకరైన నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Next Story

