Sat Dec 07 2024 18:53:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రైవేట్ వీడియోలు లీక్.. సోషల్ మీడియా ఖాతాలన్నీ డీయాక్టివేట్ చేసిన పాపులర్ స్టార్
పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియో లీక్
పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో రెహ్మాన్ తన టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డీయాక్టివేట్ చేయడానికి దారితీసింది. సోషల్ మీడియా నుండి వైదొలగే ముందు వివాదాన్ని ప్రస్తావిస్తూ రెహ్మాన్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.
ఈ సంఘటన గురించి కొంతమంది ఇది పబ్లిసిటీ స్టంట్ కావచ్చునని అన్నారు. లాహోర్‌కు చెందిన ఇమ్షా రెహ్మాన్ అక్టోబర్ 7, 2002న జన్మించింది. తన సోషల్ మీడియా అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేయడానికి ముందు, ఆమె టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చురుకుగా ఉండేది. లాహోర్‌కు చెందిన ఇమ్షా రెహ్మాన్ పాపులారిటీ కోసం ఉద్దేశపూర్వకంగా వీడియోను ఆన్లైన్లో లీక్ చేసిందంటూ ఆరోపించారు.
ఈ వారం ప్రారంభంలో పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ ప్రైవేట్ వీడియో లీక్ అయింది. ఇప్పుడు మరో పాక్ సోషల్ మీడియా సెలెబ్రిటీకి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Next Story