Fri Mar 20 2026 04:17:58 GMT+0530 (India Standard Time)
Ram Charan : పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ గురించి చర్చ..
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్న రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ జరిగింది.

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ రీచ్ ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఉన్న మీడియా అంతా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూనే వచ్చారు. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ లో కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఒక ప్రముఖ పాకిస్తాన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో RRR మూవీలో రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్ర గురించి మాట్లాడుకున్నారు. ఆ సినిమా రామ్ చరణ్ ఎంట్రీ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. వేలమంది జనాలతో రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సీన్ లో రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఈ యాక్టింగ్ గురించే పాకిస్తాన్ మీడియా గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చింది.
ఇక ఈ వీడియోని రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూ వస్తుంది. కాగా ఇటీవల ఓ హాలీవుడ్ మీడియా ఒక సినిమా కోసం వెతుకుతున్న పాత్రకి ఉదాహరణగా చరణ్ పోషించిన ఈ రామరాజు పాత్రనే చూపించుకుంటూ ఓ ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం ఇండియాలో కూడా నేషనల్ లెవెల్ రోజుకో ఈవెంట్ లో కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. దీంతో లోకల్ టు గ్లోబల్ చరణ్ పేరు మోగిపోతుంది.
Next Story

