Wed Mar 25 2026 15:19:22 GMT+0530 (India Standard Time)
కత్రినాపై మనస్సు పారేసుకున్న పాక్ కెప్టెన్

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పై మనస్సు పారేసుకున్నాడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలీవుడ్ చిత్రాలు చూస్తుంటానని, కత్రినా కైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాంటి పాత్ర వస్తే కత్రినా పక్కన బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. కత్రినా కైఫ్ నటించిన సినిమాలన్నీ చూశానని అన్నాడు.
Next Story

