Wed Mar 18 2026 03:46:19 GMT+0530 (India Standard Time)
పడి పడి లేచేమనసు కోల్ కత్తా షెడ్యూల్ పూర్తి..!

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' కోల్ కత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోల్ కత్తాలో మొత్తం 70 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అనంతరం నేపాల్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..."డైరెక్టర్ హను రాఘ వపూడి మంచి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది" పేర్కొన్నారు.
నటీనటులు:
శర్వానంద్, సాయి పల్లవి,మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్.

Next Story

