ఆ మూడు చేస్తే చాల్లే అంటున్న హీరో?
రాజకీయాల్లో నెగ్గలేక మళ్ళీ డబ్బు కోసం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కన్నుమూసి కన్నుతెరిచే లోపల మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వకీల్ [more]
రాజకీయాల్లో నెగ్గలేక మళ్ళీ డబ్బు కోసం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కన్నుమూసి కన్నుతెరిచే లోపల మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వకీల్ [more]
రాజకీయాల్లో నెగ్గలేక మళ్ళీ డబ్బు కోసం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కన్నుమూసి కన్నుతెరిచే లోపల మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వకీల్ సాబ్ సెట్స్ మీదుండగానే… క్రిష్ జాగర్లమూడితో పిరియాడికల్ మూవీ, హరీష్ శంకర్ తో మరో సినిమాని లైన్ లో పెట్టిన పవన్ చాలా సినిమాలు చేస్తాడనే అనుకున్నారు. పవన్ స్పీడు కూడా అలానే ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ తో మరో 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో వకీల్ సాబ్ కి బ్రేకులు పడ్డాయి. అలాగే వకీల్ సాబ్ సెట్స్ మీదుండగానే క్రిష్ తో సినిమా మొదలెట్టిన పవన్ ఆ సినిమా షూటింగ్ కూడా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసాడనే టాక్ ఉంది. తర్వాత హరీష్ తో పవన్ భలే చకచకా సినిమాలు చేస్తున్నాడని అన్నారు. మల్లి రాజకీయాల కోసం పవన్ త్వరగా సినిమాలు పూర్తి చేస్తాడనుకుంటే కరోనా లాక్ డౌన్ పవన్ ప్లాన్స్ మీద నీళ్లు చల్లింది.
అయితే పవన్ కళ్యాణ్ ఆ మూడు తర్వాత పూరి, త్రివిక్రమ్ లతో సినిమాలు చెయ్యొచ్చు అనే ఉహాగానాలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
కానీ పవన్ కళ్యణ్ మాత్రం ఇప్పుడు కరోనా తో చాలా టైం వెస్ట్ అయ్యింది. ఇక ఈ మూడు సినిమాలు చాల్లే.. ఈ మూడు సినిమాలు పూర్తి చేసి రాజకీయాలకే పరిమితం కావాలని పవన్ కళ్యాణ్ తాజాగా డెసిషన్ తీసుకున్నాడని టాక్ మీడియా సర్కిల్స్ లో వినబడుతుంది. సినిమాలు రాజకీయాలు అంటే కుదిరే పని కాదు…. రాజకీయాల్లో రాణించాలంటే పక్క వ్యాపకాలు ఉండకూడదని పవన్ గ్రహించాడేమో.. ఇప్పుడు అసలే ఏపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ ని పొగుడుతున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆమరావతి కోసం పోరాటం మొదలెట్టాడు. పవన్ కి రాజాకీయ అనుభవం లేదు. ఎవరు చెప్పినా వినడు. సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు అందుకోవడానికి దర్శకనిర్మాతలకు ఇప్పటికి తిప్పలే. ఇక రాజకీయాలు అంతే మరి. అందుకే పవన్ ఇప్పుడు ఈ మూడు సినిమాలు పూర్తి చేస్తే చాలనీ డిసైడ్ అయినట్టుగా ఉన్నాడు.
- Tags
- pawan kalyan