Sun Dec 08 2024 05:17:34 GMT+0000 (Coordinated Universal Time)
"మా" అధ్యక్షుడిగా మంచు విష్ణు
మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది
మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది. 'మా' అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకోవడంతో ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
రెండేళ్లకు ఒకసారి...
మా అసోసియేషన్ కు రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ప్రకటించింది. మా భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ అధ్యక్షుడిగా కొనసాగుతారని, అందుకోసమే ఎన్నికలకు వెళ్లడం కంటే ఈ కమిటీ యే ఉండటం మంచిదని భావించి విష్ణును మరోసారి ఎన్నుకున్నామని తెలిపారు
Next Story