ఎన్టీఆర్ హీరోయిన్ వచ్చేసింది
#RRR లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #RRR మొదలైనప్పుడు… ఎన్టీఆర్ గా కొమరం భీం సరసన హాలీవుడ్ హీరోయిన్ అంటూ [more]
#RRR లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #RRR మొదలైనప్పుడు… ఎన్టీఆర్ గా కొమరం భీం సరసన హాలీవుడ్ హీరోయిన్ అంటూ [more]

#RRR లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #RRR మొదలైనప్పుడు… ఎన్టీఆర్ గా కొమరం భీం సరసన హాలీవుడ్ హీరోయిన్ అంటూ ప్రకటించడం, ఆమె కొన్ని రోజులకి హ్యాండ్ ఇవ్వడంతో.. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ తో నటించే హీరోయిన్ విషయంలో చాలా టైం తీసుకుని… సినిమా షూటింగ్ మొదలైన ఏడాదికి ఎన్టీఆర్ హీరోయిన్ ని సెట్ చేసాడు. ఇప్పటికే #RRR షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందని, ఎన్టీఆర్ హీరోయిన్ ని ప్రకటించబోతున్నామంటూ సోషల్ మీడియాలో హంగామా చేసిన #RRR టీం.. చివరికి హీరోయిన్ ని ఫోటో తో సహా ప్రకటించింది.

ఎన్టీఆర్ కొమరం భీం సరసన ఒలివియా మోరిస్ నటించనుందని… ట్వీట్ చేసిన #RRR టీం ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ టీం ఒలివియా మోరిస్ స్వాగతం పలికింది. మరి చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అందమైన ఒలివియా మోరిస్ నటిస్తుంది. మరి ఎన్టీఆర్ పాత్రకి ఒలివియా మోరిస్ సరిగ్గా సరిపోతుందిలే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

