ఐపీఎల్ యాడ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కంగారు పట్టుకుంది

రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ ఐపీఎల్ యాడ్ చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కంగారు పట్టుకుంది. 'అజ్ఞాతవాసి' సినిమాతో బాగా దెబ్బ తిన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో పాత త్రివిక్రమ్ ని చూస్తాం అనుకున్నారు అంత. ఎన్టీఆర్ సినిమాలో డైలాగులు ఇరగ రాసేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
అయితే త్రివిక్రమ్ తనలో జ్యూస్ అయిపోయిందనే హింట్లు బలంగా ఇస్తున్నాడు. ఐపీఎల్ యాడ్ లో నాసి రకం ప్రాస డైలాగులతో త్రివిక్రమ్ బాగా విసిగించాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా కోసం స్టోరీ రాసేసుకున్న త్రివిక్రమ్ ఐపీఎల్ రాసిన డైలాగ్స్ లానే అందులో కూడా రాసి ఉంటాడని అనుమాన పడుతున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ యాడ్ చేయడానికి త్రివిక్రమ్ అయిష్టంగానే వున్నా తారక్ ప్రోద్బలం మీద చేసాడట. ఎలాంటి కాన్సెప్ట్ ఇవ్వకుండా ముప్పయ్ సెకండ్లలో యాడ్ కావాలని అడిగితే ఇలా కానిచ్చేసాడట. కనుక బాగా ఆలోచించి రాసుకున్న తన కథ, మాటలకి, ఈ యాడ్లో అప్పటికప్పుడు అల్లిన దానికి ముడి పెట్టడం భావ్యం కాదేమో. మరోపక్క ఒక సినిమాతో త్రివిక్రమ్ పై ఆలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాతో త్రివిక్రమ్ చాలా నోళ్లే మూయించాల్సి వుంటుంది

