Sun Oct 13 2024 14:27:29 GMT+0000 (Coordinated Universal Time)
NTR Video Call: కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్
దేవర సినిమా చూసే వరకు తనను బతికించాలని
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా చూసే వరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్(19) అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. కౌశిక్ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్లు చెబుతున్నారని, చనిపోయే లోగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలని వేడుకున్నాడు. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని కౌశిక్ తల్లిదండ్రులు కూడా కోరారు.
అయితే కౌశిక్ విషయం జూనియర్ ఎన్టీఆర్ దాకా చేరింది. అండగా ఉంటానని, అధైర్యపడకుండా ఉండాలని ఎన్టీఆర్ వీడియో కాల్ లో మాట్లాడారు. కౌశిక్‌ను చూసి నువ్వు నవ్వుతూ ఉండాలి. దేవర సినిమా తర్వాత చూస్తావు, ఫస్ట్ నువ్వు కోలుకోవాలని ఎన్టీఆర్ కౌశిక్ కు చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండాలంటూ కౌశిక్‌కు భరోసా ఇచ్చారు. కౌశిక్ అమ్మతో మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉంటే కౌశిక్ కి కొండంత బలం వస్తుందన్నారు. కౌశిక్ చికిత్సకు సంబంధించి అవసరమైనవన్ని దగ్గరుండి చూసుకుంటానని తారక్ కౌశిక్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Next Story