Sat Jan 31 2026 11:28:30 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ కోసం మెగా హీరో వస్తున్నాడు!

ఎన్టీఆర్ కోసం మెగా హీరో నాగబాబు ఈసారి రంగంలోకి దిగుతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో. నాగబాబు ఎన్టీఆర్ కి తండ్రిగా అరవింద సమేతలో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ అప్పుడే సగానికి పైగా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ అండ్ క్లాస్ లుక్ లో అలరిస్తాడని అంటున్నారు. అరవిందగా టైటిల్ రోల్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ఈషా రెబ్బ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగబాబు పాత్ర కథకు చాలా కీలకమైనదని.. నాగబాబు కి, ఎన్టీఆర్ కు మధ్యన ఎనలేని భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఎన్టీఆర్, నాగబాబు కలిసి నటించడం ఇదే మొదటిసారి. హెవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే దసరాకి విడుదల కాబోతుంది.
Next Story

