Sat Dec 07 2024 18:41:11 GMT+0000 (Coordinated Universal Time)
Devara Pre Release Event: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే!!
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో నటించిన దేవర సినిమా
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ విడుదలై 24 గంటల్లో యూట్యూబ్లో రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ అనుకోని పరిస్థితుల్లో వర్షాలు, వరదల కారణంగా ఈ కార్యక్రమం హైదరాబాద్కు షిఫ్ట్ చేశారని చెబుతున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా విడుదలకు ఐదు రోజుల ముందు సెప్టెంబర్ 22న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, సిబ్బంది అంతా పాల్గొంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెండో ట్రైలర్ను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. భారీ హైప్ తో వస్తున్న దేవర ఈ టార్గెట్ ను సులువుగా తాకేస్తుందని అంటున్నారు. పాజిటివ్ టాక్ ఉంటే ఇక బాక్సాఫీసు వద్ద సునామీ అని అంటున్నారు.
Next Story