Sun Apr 20 2025 20:19:36 GMT+0000 (Coordinated Universal Time)
తాత బయోపిక్ లో మనవడు ఉండడా..?

ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్...ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించడంపై స్పందించారు. గతంలో ఐపీఎల్ ప్రమోషన్స్ సమయంలో అడిగినప్పుడు చెప్పిందే ఇప్పుడూ తన సమాధానమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి తనకు ఎటువంటి పిలుపూ రాలేదని, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే చెబుతానని పేర్కొన్నారు. తన తాత పాత్రలో నటించే అంతస్థాయికి తాను ఇంకా చేరలేదని అన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Next Story