Sat Dec 07 2024 20:55:50 GMT+0000 (Coordinated Universal Time)
నోటీసులు తీసుకున్న రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంగోలు మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టారని మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి కించపరిచే విధంగా పోస్టింగ్లు పెట్టడమే కాకుండా మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరారు. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం వర్మకు నోటీసులు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆర్జీవీ కూటమి నేతలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.
Next Story