పారితోషికం ముఖ్యం కాదు.. కేరెక్టర్ ముఖ్యం!!
ఈమాటన్నది ఎవరో కాదు.. జగ్గూభాయ్. అదేనండి జగపతి బాబు. ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ముద్దుల హీరోగా అనేక సినిమాలు చేసిన జగపతి బాబు… సెకండ్ ఇన్నింగ్స్ లో [more]
ఈమాటన్నది ఎవరో కాదు.. జగ్గూభాయ్. అదేనండి జగపతి బాబు. ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ముద్దుల హీరోగా అనేక సినిమాలు చేసిన జగపతి బాబు… సెకండ్ ఇన్నింగ్స్ లో [more]
ఈమాటన్నది ఎవరో కాదు.. జగ్గూభాయ్. అదేనండి జగపతి బాబు. ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ముద్దుల హీరోగా అనేక సినిమాలు చేసిన జగపతి బాబు… సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఇరగదీసేస్తున్నాడు. హీరోగా ఛాన్స్ లు తగ్గాక బాగా గ్యాప్ తీసుకున్న జగపతి బాబు విలన్ గా పలు భాషల్లో అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా జగపతిబాబు ఉండాల్సిందే అనేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తనకొస్తున్న క్రేజ్ తో జగపతి బాబు పారితోషకం పెంచేసాడని.. రూపాయి తక్కువైనా సినిమాలు చెయ్యనని చెప్పేస్తున్నాడని, కేరెక్టర్ ని బట్టి జగపతి బాబు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడంటూ రకరకాల న్యూస్ లు ప్రచారం లో ఉన్నాయి.
కానీ అదంతా ఒట్టి రూమర్ అంటున్నాడు జగపతి బాబు. సినిమాల్లో నా విలనిజం, నా కేరెక్టర్స్ చూసి నాకు భారీ రెమ్యునరేషన్ ఇస్తారు అని అనుకుంటున్నారు. అలాగే నాకు ఇప్పటివరకు ఇంత రెమ్యునరేషన్ ఫిక్స్ చెయ్యలేదు. ఒక్కో సినిమాకి ఒక్కోలా నా రెమ్యునరేషన్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ, భాష, సబ్జెక్టు, సినిమాలోని పాత్రతో నా రెమ్యునరేషన్ మారిపోతుంది. అయితే నేను రెమ్యునరేషన్ గురించి, డబ్బు గురించి ఆలోచించడం లేదు.. సెకండ్ ఇన్నింగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అంటున్నాడు జగ్గు భాయ్. అయితే హీరో నుండి విలన్ గా మారక చాలా క్రేజ్ వచ్చింది అని.. హీరోగా ఒక్క భాషకే పరిమితమైతే.. విలన్ గా అనేక భాషల నుండి ఆఫర్స్ వస్తున్నాయి ఇంత కన్నా ఏం కావాలి అని అంటున్నాడు జగపతి బాబు.
- Tags
- Jagapati Babu