షాపింగ్ పిచ్చి అస్సలు లేదు!!
హీరోయిన్స్ కి షాపింగ్ అంటే ప్రాణం. షాపింగ్ చేస్తుంటే టైం తెలియదు. ఇది వాళ్ళ మాట. ఆ షాపింగ్ లో చెప్పులు, హ్యాండ్ బాగ్స్, దుస్తులు, హెయిర్ [more]
హీరోయిన్స్ కి షాపింగ్ అంటే ప్రాణం. షాపింగ్ చేస్తుంటే టైం తెలియదు. ఇది వాళ్ళ మాట. ఆ షాపింగ్ లో చెప్పులు, హ్యాండ్ బాగ్స్, దుస్తులు, హెయిర్ [more]
హీరోయిన్స్ కి షాపింగ్ అంటే ప్రాణం. షాపింగ్ చేస్తుంటే టైం తెలియదు. ఇది వాళ్ళ మాట. ఆ షాపింగ్ లో చెప్పులు, హ్యాండ్ బాగ్స్, దుస్తులు, హెయిర్ బ్యాండ్ దగ్గరనుండి పిన్ వరకు కొంటుంటారు. అలా హీరోయిన్స్ షాపింగ్ పిచ్చిలో పడి లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ ఓ హీరోయిన్ కి మాత్రం షాపింగ్ అంటే అస్సలు పిచ్చి లేదట. చిన్నప్పటినుండి సగటు మధ్యతరగతి అమ్మాయిలా పెరిగిన అనుపమ పరమేశ్వరన్ కి షాపింగ్ పిచ్చి లేదట. మధ్యతరగతి కుటుంబంలో పుట్టబట్టే ఆర్థికపరమైన విషయాల్లో అనుపమకు అనుభవం ఉందట.
అయితే అదేపనిగా ఆర్థికపరమైన విషయాల గురించి లెక్కలేసుకోను అని అంటుంది. నాకు ఎంత పారితోషకం వస్తుందో తెలుసు. కానీ ఆ తర్వాత విషయాలన్నీ మా అమ్మ నాన్నలే చూసుకుంటారు. వ్యక్తిగతంగా బ్రతకాలంటే డబ్బే ఆవరసరం లేదు. అయినా నాకు డబ్బుతో పెద్దగా పనేముంది,. షాపింగ్ పిచ్చి లేదు.. ఎప్పుడో కానీ బయటికి కూడా వెళ్ళను. అయినా హైదరాబాద్ లో ఉంటే చేతిలో 1000 రూపాయలుంటే చాలనుకునే రకాన్ని నేను. సినిమా, నటన ఈ రెండు ఉంటే చాలు. అంతకు మించిన పిచ్చి నాకు లేదు అంటుంది అనుపమ పరమేశ్వరన్.