ఎందుకు బాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు!!
ఏ సౌత్ హీరోయిన్ కైనా బాలీవుడ్ మీద ఉండే మోజు మరే భాష మీద ఉండదు. ఇక్కడ సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో అవకాశం కోసం వెయ్యి [more]
ఏ సౌత్ హీరోయిన్ కైనా బాలీవుడ్ మీద ఉండే మోజు మరే భాష మీద ఉండదు. ఇక్కడ సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో అవకాశం కోసం వెయ్యి [more]
ఏ సౌత్ హీరోయిన్ కైనా బాలీవుడ్ మీద ఉండే మోజు మరే భాష మీద ఉండదు. ఇక్కడ సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే తెలుగులో సమంత కోలీవుడ్ లో నయనతార మాత్రం బాలీవుడ్ వైపు కనెత్తి కూడా చూడరు. సమంత అయినా బాలీవుడ్ వెబ్ సీరీస్ కి వెళ్ళింది కానీ.. నయనతార మాత్రం బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోకుండా కాలదన్నుతుంది. అదే తమన్నా, కాజల్, త్రిష, రకుల్ ప్రీత్, ఇలియానా వంటి భామలు చిన్న అవకాశం బాలీవుడ్ లో వచ్చిన వదలరు. అదే స్టార్ హీరో అవకాశం అయితే ఎగిరి గంతేస్తారు.
అయితే ఇప్పుడు నయనతార గతంలో ఓ స్టార్ హీరో నటించిన టాప్ సూపర్ హిట్ మూవీ అవకాశం కాలదన్నింది అనే న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లోను, టాలీవుడ్ మీడియా లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ సినిమా అంట. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ మూవీ. అందులో దీపికా పదుకొనే హీరోయిన్. షారుఖ్ ఖాన్ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందొ.. ఆ సినిమాలో దీపికా పాత్రకి అంటే ఇంపోర్టన్స్ ఉంది. అలాంటి సినిమాలో నయనతారకి ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. భారీ పారితోషకం ఇస్తాం అన్నా నయనతార ఆ ఐటెం ఆఫర్ ని కాలదన్నిందట. మరి షారుఖ్ సినిమా లో వచ్చిన ఆ అవకాశాన్ని నయనతార ఎంత డేర్ గా కాదందో. అంటే అమ్మడుకి బాలీవడో అంటే చిన్న చూపా.. లేదంటే ఐటెం సాంగ్ అంటే చిన్న చూపా? ఏది ఏమైనా నయనతార మాత్రం బాలీవడో కి వెళ్లేలా కనిపించడం లేదు.
- Tags
- nayanatara