తండ్రి తండ్రే.. రాజకీయం.. రాజకీయమే!!
హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ…. సొంత కాళ్ళ మీద నిలబడడానికి చాలా కష్టాలు పడింది. కమల్ నా తండ్రి నాకు అవకాశాలు ఇవ్వండి [more]
హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ…. సొంత కాళ్ళ మీద నిలబడడానికి చాలా కష్టాలు పడింది. కమల్ నా తండ్రి నాకు అవకాశాలు ఇవ్వండి [more]
హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ…. సొంత కాళ్ళ మీద నిలబడడానికి చాలా కష్టాలు పడింది. కమల్ నా తండ్రి నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగలేదు. తనకి తానుగా హీరోయిన్ గా, సింగర్ గా తనని తాను నిరూపించుకున్న తార శృతి హాసన్. ఇక కమల్ హాసన్ కూడా కూతుళ్లు స్వస్తక్తితోనే పైకి రావాలని.. అందులో తన పాత్ర ఉండకూడదనుకునే మనిషి. ఇప్పుడు శృతి హాసన్ కూడా తండ్రి తండ్రే.. రాజకీయాలు రాజకీయాలే అంటుంది. ఎందుకంటే కమల్ హాసన్ తమిళనాట ఓ రాజకీయ పార్టీ పెట్టడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నాడు.
అందుకే మీరు మీ తండ్రి కమల్ హాసన్ గారిని రాజకీయంగా సపోర్ట్ చేస్తారా? ఆయన తరుపున ప్రచారానికి వెళతారా? అని శృతి హాసన్ ప్రశ్నిస్తే.. ప్రజలకు ఏదో సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం, తపన, కోరిక, ఆశ అన్ని తన తండ్రితో ఉన్నాయని… అందుకే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని, కానీ నాకు ఈ రాజకీయాల మీద ఆసక్తి లేదు. అలాగే ఈ రాజకీయాలు నాకు సరిపడవని తెగేసి చెబుతుంది. అంతేకాదండోయ్.. తన తండ్రి కమల్ తరపున ప్రచారంలో కూడా పాల్గొనని చెప్పేసింది. ఆఖరుకి కమల్ కూడా ఈ విషయంలో తనని అడగరని చెబుతుంది శృతి హాసన్.
- Tags
- shruthi hasan