Sun Dec 08 2024 03:09:11 GMT+0000 (Coordinated Universal Time)
Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే: నిర్మాత క్లారిటీ
మెగా కుటుంబంలో విబేధాలు వచ్చాయంటూ
మెగా కుటుంబంలో విబేధాలు వచ్చాయంటూ ఇటీవల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే బూతులు తిట్టుకునేలా చర్చా వేదికను ఏర్పాటు చేసి హీరో అభిమానులను రెచ్చగొట్టాయి కూడా.
సినీ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు 'పుష్ప 2' గురించి కాదని అన్నారు. పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. 'మత్తు వదలరా-2' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో రవిశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మేము పవన్ కళ్యాణ్ ను కలిశామన్నారు, 'ఉస్తాద్ భగత్‌సింగ్' షూట్ కొన్ని వారాల్లోనే మొదలు కానుందన్నారు. చిత్రం తాలూకు మొత్తం షూటింగ్ జనవరి 2025 వరకు పూర్తి చేసేయాలని నిర్ణయించామని తెలిపారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే షూటింగ్ పూర్తైన పార్ట్ నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ప్రైజ్ అభిమానులకు ఇస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా వస్తోంది.
Next Story