ట్రైలర్ లో ఒక్క సీన్ కే ఛాన్స్ ఇచ్చారా?
అల వైకుంఠపురములో మ్యానియా మాములుగా లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా త్రివిక్రమ్ ఆలా వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే. కామెడీ ఎంటెర్టైనెర్ గా [more]
అల వైకుంఠపురములో మ్యానియా మాములుగా లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా త్రివిక్రమ్ ఆలా వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే. కామెడీ ఎంటెర్టైనెర్ గా [more]

అల వైకుంఠపురములో మ్యానియా మాములుగా లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా త్రివిక్రమ్ ఆలా వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే. కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో ట్రైలర్ తాజాగా విడుదలై సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ మొత్తానికి అల్లు అర్జున్ మ్యానరిజం, లుక్స్, పాత్రలోని అమాయకత్వం, త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్, కామెడీ పంచ్ లు హైలెట్ గా నిలుస్తుంటే… హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ సూపర్ అనేలా ఉంది. ఇక పూజ హెగ్డే తో పాటుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. నివేత పేతురేజ్ అల్లు అర్జున్ సెకండ్ హీరోయిన్. అయితే మొదటినుండి నివేత పేతురేజ్ పాత్రని ఎక్కడా ఎక్కువగా రివీల్ చెయ్యకుండా కేవలం పూజ హెగ్డే పాత్రని, ఆమె గ్లామర్ నే హైలెట్ చేస్తూ వస్తుంది అల టీం.
తాజాగా అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సెర్ట్ కి పూజ హెగ్డే డుమ్మా కొట్టగా.. నివేత అందంగా తయారై ఆ ఈవెంట్ కి వచ్చేసింది. పూజ హెగ్డే అక్కడ లేని లోటు నివేత పేతురేజ్ అందమైన డ్రెస్ తో లుక్ తో తీర్చేసింది. అయితే నివేత పేతురేజ్ అల సినిమాలో పాత్ర ఏమిటో క్లారిటీ లేదు కానీ… ఆమెని మరీ కూరలో కర్వేపాకులా.. ట్రైలర్ జస్ట్ అల్లు అర్జున్ కి ఫ్లైయింగ్ కిస్ పెడుతున్నప్పుడు మాత్రం చూపించి మాయం చేసారు.మరి మొదటినుండి ప్రాధాన్యత లేదు సరే.. కనీసం ట్రైలర్ లో అయినా ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సిందిగా అంటున్నారు. మరి పూజ ముందు నివేత ఎందుకనుకున్నారో… లేదంటే ఆమె పాత్రని సినిమా లో కొత్తగా చూపిస్తాం కదా.. ఇప్పటినుండే రివీల్ చెయ్యడమెందుకు అనుకున్నారో.. కానీ ట్రైలర్ లో ఒక్క సీన్ కే నివేతని పరిమితం చేసారు

