ఇస్మార్ట్ అందం అలా పనికొచ్చింది
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటాషాలకు భారీ క్రేజ్ వచ్చి భారీ అవకాశాలొస్తున్నాయ్ అనుకున్నారు. అంతేకాదు.. ఈ భామలిద్దరు గ్లామర్ [more]
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటాషాలకు భారీ క్రేజ్ వచ్చి భారీ అవకాశాలొస్తున్నాయ్ అనుకున్నారు. అంతేకాదు.. ఈ భామలిద్దరు గ్లామర్ [more]
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటాషాలకు భారీ క్రేజ్ వచ్చి భారీ అవకాశాలొస్తున్నాయ్ అనుకున్నారు. అంతేకాదు.. ఈ భామలిద్దరు గ్లామర్ షో కోసం తదుపరి సినిమాల్లో భారీగా గా డిమాండ్ చేస్తున్నారనే న్యూస్ నడిచింది. ఇక ప్రస్తుతం నభ నటాషా మాత్రం స్పీడు గేర్ లోనే సినిమాలు చేస్తుంది. కానీ నిధి అగర్వాల్ కే ఇంతవరకు సినిమా దొరకలేదు. నభ నటాషా సాయి ధరమ్ తేజ్ తోనూ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సినిమాలు చేస్తుంది. ఇక నిధి మాత్రం హీరోయిన్ అయినా పర్లేదు.. ఐటెం అయినా పర్లేదు అంటూ ఆఫర్స్ కోసం ఎదురు చోస్తుంది.
అయితే ఈ హాట్ గర్ల్ నిధి కి బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం అవకాశం వచ్చింది అట. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఐటెం చెయ్యడానికి ఆసక్తి చూపడంతో పాటుగా ఐటెం సాంగ్ కోసం భారీ పారితోషకం డిమాండ్ చేస్తుందట. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే స్టెప్స్ వెయ్యడానికి నిధి భారీ మొత్తాన్ని డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. అయితే నిధి అందాల కోసం నిర్మాతలు ఎంతైనా వెనుకాడలేదని.. అల్లుడు అదుర్స్ ఐటెం కోసం నిధి అక్షరాలా 80 లక్షలు పారితోషకం పట్టుకుపోయింది అనే టాక్ నడుస్తుంది. మరి ఒక్క ఐటెం కె నిధికి 80 లక్షలంటే.. హీరోయిన్ గా ఏ రెండు కొట్లో అడుగుతుందేమో.