Thu Dec 05 2024 17:00:52 GMT+0000 (Coordinated Universal Time)
గాడ్ ఫాదర్ నుంచి మెగా అప్డేట్ రానుందా ?
చిరంజీవి 153వ సినిమా రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ నుంచి చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు ..
మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఒకటి గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సౌత్ లేడీసూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చిరంజీవితో స్టెప్పులు వేయించారు.
చిరంజీవి 153వ సినిమా రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ నుంచి చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు మెగా, సినీ అభిమానులు. ఇప్పటికే ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్ లో సల్లూభాయ్తో కలిసి సాంగ్ షూట్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న గాడ్ ఫాదర్ కు ఎస్ ఎస్ తమన్ సంగీత బాణీలు సమకూరుస్తున్నారు.
Next Story