Fri Dec 05 2025 10:19:19 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య, చిరంజీవి ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్
నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ఎపిసోడ్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది.

నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ఎపిసోడ్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్లో మెగా అభిమానుల సమావేశం నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో ఆంధ్రా, తెలంగాణ మెగా అభిమానుల అత్యవసర సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది.
ఫిర్యాదు చేయాలని...
నందమూరి బాలకృష్ణపై పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇవాళ జూబ్లిహిల్స్ పీఎస్, రేపు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానులను చిరంజీవి వారించారు. అలాంటి పనులు చేయొద్దని ఫ్యాన్స్ను చిరంజీవి హెచ్చరించడంతో వెనక్కు తగ్గారు.
Next Story

