కన్నప్ప సినిమాకు కొత్త చిక్కులు.. మంచు కుటుంబం మమ్మల్ని టార్గెట్ చేసింది!!
మంచు విష్ణు నటిస్తోన్న భారీ చిత్రం ‘కన్నప్ప’.

మంచు విష్ణు నటిస్తోన్న భారీ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటించారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండగా వివాదాలు ఈ సినిమాను వెంటాడుతూ ఉన్నాయి. ఈ మూవీలో పిలక- గిలక అనే పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, సప్తగిరిలకు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు.
గిలక పాత్రలపై
ఈ పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ‘కన్నప్ప’ సినిమాలో లేవని సినీనటులు మోహన్ బాబు, విష్ణు స్పష్టం చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తోంది. బ్రాహ్మణ జాతి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తోందని బ్రాహ్మణ చైతన్య వేదిక నేతలు విమర్శించారు. దేనికైనా రెడీ సినిమాలో కూడా బ్రాహ్మణులను అవమానించారని, ఇప్పుడు కన్నప్ప సినిమా విషయంలోనూ అదే జరుగుతోందని ఆరోపించారు.