Fri Mar 20 2026 06:22:03 GMT+0530 (India Standard Time)
NBK 107 : వీరసింహారెడ్డిగా బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే !
నేడు టైటిల్ లాంచింగ్ అని ప్రకటించినప్పటి నుంచి సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. NBK 107 కి అన్నగారు, రెడ్డిగారు..

గతేడాది బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమాను లైన్లో పెట్టాడు బాలయ్య. ఆది నుంచి NBK 107గా చెబుతోన్న బాలకృష్ణ సినిమా టైటిల్ ను శుక్రవారం రాత్రి 8.15 గంటలకు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద ఆవిష్కరించారు. బాలయ్య సినిమా టైటిల్ లాంచ్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. NBK 107 టైటిల్ - వీరసింహారెడ్డిగా అనౌన్స్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.
నేడు టైటిల్ లాంచింగ్ అని ప్రకటించినప్పటి నుంచి సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. NBK 107 కి అన్నగారు, రెడ్డిగారు, వీర సింహారెడ్డి వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అనుకున్నట్టే సినిమా టైటిల్ ను వీరసింహారెడ్డిగా ప్రకటించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరసింహారెడ్డి షూటింగ్ దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. 2023 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ.
Next Story

