Tue Dec 30 2025 15:25:08 GMT+0000 (Coordinated Universal Time)
నయనతార హిట్ చిత్రం తెలుగులోకి...

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'ఇమైక్కా నొడిగళ్' తెలుగులోకి అనువాదం అవుతుంది. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' టైటిల్ ని ఖరారు చేసారు. ఆర్.అజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో మెరవనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుగ్గా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
Next Story

