Thu Dec 05 2024 15:40:59 GMT+0000 (Coordinated Universal Time)
"కనెక్ట్" టీజర్.. ఇక ప్రతి నిమిషం నీ ప్రాణాలకు ప్రమాదమే
ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. అలా ఈ సినిమాలో..
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార.. ఇటీవల ఎక్కువగా నాయిక పాత్రలు ప్రధానంగా సాగే సినిమాలను ఎంచుకుంటోంది. ఈ ఏడాది విడుదలైన గాడ్ ఫాదర్ లో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించింది నయనతార. ఆమె మెయిన్ లీడ్ లో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఆమె చేసిన సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. తాజాగా ఆమె చేసిన మరో హారర్ థ్రిల్లర్ సినిమా 'కనెక్ట్'.
తాజాగా కనెక్ట్ నుండి తెలుగు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. అలా ఈ సినిమాలో నయనతార ఒక ఆత్మను పిలిస్తే.. మరో ఆత్మ వస్తుంది. ఆ తరువాత నుండి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. నయనతార వాటి నుండి ఎలా బయటపడింది. ఇంతకీ నయన్ తో మాట్లాడేందుకు వచ్చిన ఆ ఆత్మ ఎవరిది ? అన్నదే సినిమా.
టీజర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే కట్ చేశారు. సత్యరాజ్ నయనతారతో వీడియో కాల్ మాట్లాడుతూ.. నీ వెనుక ఉన్నది అమ్ము కాదు.. ఇక ప్రతి నిమిషం నీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్తాడు. నయనతార సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను.. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Next Story