Sun Feb 01 2026 05:30:27 GMT+0000 (Coordinated Universal Time)
29న బరిలో దిగుతున్న 'లేడీ టైగర్'

లేడీ సూపర్ స్టార్ నయనతార మలయాళంలో నటించగా మంచి విజయం సాధించిన 'ఎలెక్ట్రా' చిత్రాన్ని తెలుగులో 'లేడీ టైగర్' పేరుతొ ప్రేక్షకులకు అందిస్తున్నారు. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి సరోజ సురేష్ ఈ చిత్రానికి సహ నిర్మాత. ప్రకాష్ రాజ్, మనీష కొయిరాలా, బిజూ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాంప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని సురేష్ సినిమా అధినేత సురేష్ దూడల మాట్లాడుతూ... 'లేడీ సూపర్ స్టార్' నయనతార ఫ్యాన్స్ కి పండగలాంటి సినిమా 'లేడీ టైగర్'. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా నిలుస్తుంది. అలాగే మనీషా కొయిరాలా నటన కూడా. ఈనెల 29న విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు!!
Next Story
