Mon Dec 15 2025 08:13:13 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi: పవన్ వల్లే చిరుకి పద్మవిభూషణ్ ఇచ్చారు.. నిర్మాత వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారంటూ నిర్మాత నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే, చిరంజీవికి ఈ అవార్డు రావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కూడా సంచలన కామెంట్స్ చేశారు.
నట్టి కుమార్ కామెంట్స్.. "అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం అనేది తెలుగు ప్రజలకు గర్వకారణమైన విషయమే. సినిమా పరిశ్రమకి అందించిన సేవలతో పాటు బ్లడ్ బ్యాంక్ మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించే చిరంజీవి.. ఈ పద్మవిభూషణ్ కి అర్హులే. కానీ ఇప్పుడు రావడం అనేది మాత్రం కచ్చితంగా మోదీ, అమిత్ షాల రాజకీయ వ్యూహం. పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారు. దీని వల్ల బీజేపికీ పవన్ నుంచి సపోర్ట్ దొరుకుతుందని మోదీ టీం ప్లాన్. రాజమౌళి తండ్రికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక కూడా ఇదే కారణం ఉంటుంది.
నిజానికి ఈ సమయంలో చిరంజీవి కంటే సోనూ సూద్ కి ఇచ్చి ఉంటే బాగుండేది. కరోనా టైములో ఆయన ఎంతటి సేవలు చేశారో అందరికి తెలుసు. బహుశా బీజీపీ వాళ్ళకి సోనూ సూద్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. భవిషత్తులో అయినా ఆయనని గుర్తించి ఆయనకి అవార్డు ఇస్తారని ఆశిద్దాం" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story

