Fri Dec 05 2025 13:18:06 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika Mandanna : వెరైటీ పాత్రలో రష్మిక.. అభిమానులకు మరో రకమైన అనుభూతి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త ప్రాజెక్ట్ ను రివీల్ చేసింది. రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా నటిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త ప్రాజెక్ట్ ను రివీల్ చేసింది. రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా నటిస్తున్నారు. వరసగా పుష్ప, ఛావా, సికిందర్ సినిమాల్లో నటించి మెప్పించిన రష్మిక ఇక తాజాగా కుబేర మూవీలో అందరినీ అలరించింది. రెండు రోజుల క్రితమే తన ఫ్యాన్స్ కు పజిల్ కూడా పెట్టింది రష్మిక. తన తర్వాత ప్రాజెక్టు ఏంటో చెప్పాలని, చెబితే వారితో తాను మీట్ అవుతానని ప్రకటించింది. అయితే రష్మిక ప్రస్తుతం రివీల్ చేసిన కొత్త ప్రాజెక్టును బట్టి చూస్తే విభిన్న మైన పాత్రలో కనిపించనుందన్నది తేలిపోయింది.
కొత్త ప్రాజెక్టులో...
ఇప్పటి వరకూ హీరోయిన్ గా స్టెప్పులతో, తన నటనతో అదరగొట్టిన రష్మిక కొత్త ప్రాజెక్టు లో మాత్రం యోధురాలిగా కనిపించనుందని అర్థమయింది. రష్మిక నటిస్తున్న కొత్త చిత్రం పేరు మైసా అని టైటిల్ గా ఖరారయింది. ఈ మూవీకి దర్శకుడిగా రవీంద్ర పూలే వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా దేశంలో ఐదు భాషల్లో ఒకే సారి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. కేవలం అందంతోనే కాకుండా విభిన్న పాత్రలో నటించి మెప్పించాలన్న ఆమె కోరిక మేరకు విభిన్న పాత్రను ఎంచుకున్నట్లు కనపడుతుంది.
పోస్టర్ ను విడుదల చేసి...
రష్మిక నటిస్తున్న మైసా చిత్రం పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ ను చూస్తేనే రష్మిక వెరైటీ పాత్రలో కనిపించనున్నారు. భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నానని రష్మిక చెప్పకనే చెప్పినట్లయింది. యోధురాలిగా కనిపిస్తుండటంతో ఈ మూవీలో రష్మికదే ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరిగేదిలా కథనం ఉందని, టైటిల్ కూడా అలాగే ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ ద్వారా ఎమోషనల్, పవర్, యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఎంచుకున్నానని రష్మిక కూడా చెప్పడంతో ఆమె అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
Next Story

